Header Banner

ఇరాన్‌పై దాడికి రంగం సిద్ధం చేస్తున్న ఇజ్రాయెల్... డ్రోన్లు, మిసైళ్లు తో!

  Wed Jun 11, 2025 19:59        U A E

అమెరికా (USA), ఇరాన్ (Iran) అణుఒప్పందం పై చర్చించేందుకు మరోసారి సమావేశం కాబోతున్న తరుణంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కీలక ప్రదేశాలకు ఆయుధాల తరలింపు పనులు చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా విదేశీ వ్యవహారాల నిపుణులు మేరీల్యాండ్లోని క్యాంప్ డేవిడ్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇరాన్ అంశంలో అమెరికా వ్యూహం గురించి గంటలపాటు చర్చించారు. ఈ క్రమంలోనే ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత నెతన్యాహు రక్షణశాఖ ఉన్నతాధికారులు, కీలక మంత్రులతో అత్యవసర భద్రత సమావేశం నిర్వహించారు. ఇరాన్లోని అణుకేంద్రాలు, అణుఆయుధాల ఉత్పత్తిలో ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుకులకు సిద్ధమవుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పదేపదే చెబుతున్నాయి. అయితే, దాడుల తీవ్రత ఎలా ఉంటుంది? ఎప్పుడు దాడులు చేసే అవకాశం ఉంది? దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే తుది నిర్ణయం తీసుకుందా? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: మీకు భూమి ఉందా.? బంగారాన్ని పండించొచ్చు.! మార్కెట్ ప‌రిస్థితికి అనుగుణంగా..

ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే దీటుగా బదులిచ్చేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రతిచర్యగా ఇజ్రాయెల్పై అణు ఆయుధాలను ప్రయోగించే అవకాశముందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఇజ్రాయెల్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్ అణుస్థావరాలపై దాడి జరిగితే ఇరానియన్లు చూస్తూ ఊరుకోరు. న్యూక్లియర్ ఆయుధాన్ని ఇజ్రాయెల్పై ప్రయోగించే అవకాశం ఉంది. దాని తీవ్రత ఊహకందని విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగొచ్చు" అని గ్రోసీ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి అడుగులు వేస్తోంది. దీనిపై ఇటీవల ఒమన్లో ఉన్నతస్థాయి చర్చలు కూడా జరిగాయి. అయితే, అమెరికా ప్రతిపాదనను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విమర్శించారు. యూఎస్ ప్రతిపాదన తమ చర్యలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. మరోసారి అమెరికా చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈసారి కూడా 'నో' చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని వైపుల నుంచి ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకే ఇజ్రాయెల్ను అమెరికా పురిగొలిపినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

 పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు! 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

  

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

 ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

  

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #iran #israel #drones #missiles #attack #war #attack